చి.ల.సౌ రివ్యూ & రేటింగ్

August 03, 2018


img

రేటింగ్ : 3/5

కథ :

బిజినెస్ ఎనలిస్ట్ అయిన అర్జున్ బాగా డబ్బు సంపాదించి పెద్ద కారు, యూరప్ లో సెటిల్ అవడం లాంటి కోరికలను పెట్టుకుంటాడు. ఇంతలో ఇంట్లో వారు పెళ్లిగోల మొదలు పెడతారు. తప్పదన్నట్టు అంజలి (రుహాని శర్మ)తో పెళ్లిచూపులకు ఒప్పుకుంటాడు. పెళ్లి ఇష్టం లేదని పరిచయం లోనే మాట్లాడి రోజు గడిసే సరికి ఆమెని పెళ్లాడేలా పరిస్థితులు మారుతాయి. ఇంతకీ అర్జున్, అంజలిల మధ్య ఒకరోజులో ఏం జరిగింది అన్నదే ఈ సినిమా కథ.

విశ్లేషణ :

తెలిసిన కథను తెలిసిన విధంగానే కాస్త ఎమోషన్, కాస్త ఫన్ యాడ్ చేసి వదిలితే ఎలా ఉంటుంది అదే చి.ల.సౌ సినిమా. దర్శకుడు రాహుల్ రవింద్రన్ స్మార్ట్ డైరక్షన్ సినిమాకు పెద్ద అసెట్. కథ ఏమంతా కొత్తగా అనిపించకున్నా కథనం మాత్రం చాలా ఫ్రెష్ గా ఉంటుంది. సినిమా అంతా సరదాగా సాగుతుంది అన్న భావన ఉంటుంది.

సినిమాలో మొదటి భాగం పెళ్లిచూపులు ఆ తర్వాత వారి మధ్య డిస్కషన్ కాగా సెకండ్ హాఫ్ ఓ క్రైం స్టోరీగా టర్న్ తీసుకున్నా మళ్లీ దర్శకుడు లవ్ స్టోరీ మీదే ఫోకస్ పెట్టాడు. సినిమా కథ, కథనాల్లో రాహుల్ పనితనం మెచ్చుకొదగినదిగా ఉంటుంది. పాత్రల స్వభావాలు కూడా చాలా సున్నితంగా ఉంటాయి.    

మంచి కథ.. మనసుని తాకే ఎమోషన్స్ తో పాటుగా అక్కడక్క ఫన్ ఎలిమెంట్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఫైనల్ గా సుశాంత్ తనని ఆడియెన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి కథతో వచ్చి మెప్పించాడు.

నటన, సాంకేతిక వర్గం :

సుశాంత్ ఇన్నాళ్లు చేసిన సినిమాలు ఒక ఎత్తైతే ఈ సినిమా మరో ఎత్తు. అర్జున్ పాత్రలో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక రుహాని శర్మ కూడా అలరించింది. లీడ్ పెయిర్ బాగా చేశారు. సినిమాలో వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ కామెడీ బాగుంది. అను హాసన్, రోహిణి పాత్రలు అలరించాయి.

టెక్నికల్ టీం విషయానికొస్తే.. సుకుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా ఫీల్ కంటిన్యూ అయ్యేలా చేసింది. ప్రశాంత్ విహారి సంగీతం బాగుంది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకు ప్లస్ అయ్యింది. ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగినట్టు ఎంత కావాలో అంతా పెట్టేశారు.

ఒక్కమాటలో :

చి.ల.సౌ.. సుశాంత్ మెప్పించాడు..!



Related Post

సినిమా స‌మీక్ష