ఇతన్ని మరో కమల్ హాసన్ అనేయొచ్చు..!

July 20, 2018


img

స్టార్లు.. సూపర్ స్టార్లు ఎంతమంది వచ్చినా సహజ నటన.. ఎంచుకున్న పాత్రకు నిజరూపం ఇదేనేమో అనేలా పరిపూర్ణత తెచ్చే నటుడు.. లోక నాయకుడు కమల్ హాసన్ ఒక్కడే. ఆయన ఏ సినిమా చేసినా ఎన్ని అవతారాలేసినా అందులో కేవలం పాత్ర మాత్రమే కనబడుతుంది కాని కమల్ హాసన్ కనబడడు. అయితే కమల్ హాసన్ అంత కాకున్నా అతని మార్గంలో వెళ్తూ ప్రతిభ చాటుతున్నాడు విజయ్ సేతుపతి.   

ప్రస్తుతం ఆయన చేస్తున్న సీతకాతి సినిమాలో వయో వృద్ధుడిగా కనిపిస్తున్నాడు విజయ్ సేతుపతి. ఆ పాత్ర కోసం విజయ్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. గంటల కొద్ది మేకప్ వేసుకోవాల్సి వచ్చేదట. ప్రోస్థేటిక్స్ మేకప్ ద్వారా విజయ్ తన లుక్ మార్చుకున్నాడు. తను ఎంచుకున్న ప్రతి కథలో వైవిధ్యం ఉండేలా చూడటమే కాకుండా పాత్రలను కొత్తగా ఉండేలా చూస్తున్నాడు విజయ్ సేతుపతి. కచ్చితంగా ఫ్యూచర్లో ఇతని నటనకు ప్రేక్షకులు నీరాజనాలు అందించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం తమిళంలోనే మార్కెట్ ఉన్న విజయ్ తెలుగులో కూడా తన మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నాడు.



Related Post

సినిమా స‌మీక్ష