పవన్ తర్వాత నానితో..!

July 19, 2018


img

కోలీవుడ్ లో సెన్సేషనల్ మ్యూజిక్ డైరక్టర్ అయిన అనిరుధ్ రవిచందర్ తెలుగులో చేసిన సినిమా అజ్ఞాతవాసి. తమిళంలో అతను మ్యూజిక్ అందించిన సినిమాలు ఇక్కడ డబ్ అయ్యి సక్సెస్ సాధించాయి. అయితే పవర్ స్టార్ సినిమాతో పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చిన అనిరుధ్ ఇక్కడ ఆడియెన్స్ ను మెప్పించలేకపోయాడు. అజ్ఞాతవాసిలో పాటలు ఏమాత్రం ఆడియెన్స్ ను ఆకట్టుకోలేదు.     

త్రివిక్రం ఆ తర్వాత చేస్తున్న ఎన్.టి.ఆర్ సినిమాకు ముందు అనిరుధ్ తో మ్యూజిక్ అనుకున్నా అజ్ఞాతవాసి ఎఫెక్ట్ తో ఆ ప్రాజెక్ట్ నుండి తొలగించారు. లేటెస్ట్ గా అనిరుధ్ రవిచందర్ మరో తెలుగు సినిమాకు సైన్ చేశాడు. నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న జెర్సీ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడట. అజ్ఞాతవాసి ఫ్లాప్ అవడంతో మంచి కసి మీద ఉన్న అనిరుధ్, నాని సినిమాతో తన టాలెంట్ చూపించాలనుకుంటున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు.         

 


Related Post

సినిమా స‌మీక్ష