బాలీవుడ్ 'బ్రహ్మస్త్ర'లో నాగార్జున..!

July 10, 2018


img

టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జునలు బాలీవుడ్ లో ప్రయత్నాలు చేశారు కాని సక్సెస్ అవలేదు. తెలుగులో స్టార్ ఇమేజ్ ఉన్నా బాలీవుడ్ లో వారికి సరైన హిట్ దక్కలేదు. బాలకృష్ణ మాత్రం ఇప్పటివరకు బాలీవుడ్ సినిమా చేయలేదు. హీరోగా అక్కడ వారే ఫుల్ కాంపిటీషన్ గా మారారు. ఇక యువ హీరోలలో రాం చరణ్, రానాలు బాలీవుడ్ ప్రయత్నాలు చేస్తున్నారు.  

ఇక ఇప్పుడు నాగార్జున 15 ఏళ్ల తర్వాత ఓ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నారు. అయితే హీరోగా కాదు సపోర్టింగ్ రోల్ లో కనిపించనున్నారు. రణ్ బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా బ్రహ్మస్త్ర. ఈ సినిమాలో నాగార్జున క్రేజీ రోల్ లో కనిపించనున్నారట. అయాన్ ముఖర్జీ డైరక్షన్ లో కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమానతో బాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. మరి ఈ రీ ఎంట్రీ నాగార్జునకు బాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ వచ్చేలా చేస్తుందో చూడాలి.  Related Post

సినిమా స‌మీక్ష