డైలమాలో పడ్డ సుకుమార్..!

July 10, 2018


img

రంగస్థలం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సుకుమార్ రాం చరణ్ కెరియర్ లోనే కాదు తన కెరియర్ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇన్నాళ్లు స్టార్ డైరక్టర్ గా ఉన్నా అందుకు తగిన హిట్ అందుకోని సుక్కు రంగస్థలంతో తన రేంజ్ ఏంటో చూపించాడు. ఇక ఈ సినిమా తర్వాత అసలైతే మహేష్ తో సినిమా చేయాల్సి ఉంది. రంగస్థలం నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ చేయిస్తున్నారు.

లేటెస్ట్ గా సుకుమార్ కు ఓ బాలీవుడ్ ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. బీ టౌన్ క్రేజీ హీరో వరుణ్ ధావన్ సుకుమార్ డైరక్షన్ లో సినిమా చెసేందుకు ఫిక్స్ చేసుకున్నాడు. మహేష్ 26వ సినిమా సుకుమార్ తో చేయాల్సి ఉండగా ఈలోగా బాలీవుడ్ ఆఫర్ సుకుమార్ ను డైలమాలో పడేసింది. మరి మహేష్ సినిమా కాదని సుకుమార్ బాలీవుడ్ సినిమా చేస్తాడా లేక మొదట మహేష్ సినిమా చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. 

మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ 6 నెలల్లో వరుణ్ ధావన్ సినిమా చేసి మళ్లీ వచ్చి మహేష్ తో సినిమా చేస్తే పర్వాలేదు. ఆల్రెడీ మహేష్ తో సుకుమార్ 1 నేనొక్కడినే సినిమా చేశాడు కాని అది ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు. Related Post

సినిమా స‌మీక్ష