మహానటితో మరోసారి..!

June 23, 2018


img

సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమాతో సత్తా చాటిన కీర్తి సురేష్ ఓ పక్క స్టార్ సినిమాలతో పాటుగా క్రేజీ ఛాన్సెస్ అందుకుంటుంది. తమిళంలో విజయ్ తో జోడి కడుతున్న అమ్మడు లేటెస్ట్ గా నాచురల్ స్టార్ తో మరో సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది. నానితో నేను లోకల్ లో ఆల్రెడీ స్క్రీన్ షేర్ చేసుకున్న అమ్మడు ఇప్పుడు నాని చేస్తున్న జెర్సీ సినిమాలో కూడా అవకాశం దక్కించుకుందట.       

మహానటి సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించిన కీర్తి సురేష్ నాని జెర్సీలో లక్కీ ఛాన్స్ పట్టేసింది. ఇదే కాకుండా రాజమౌళి మెగా నందమూరి మల్టీస్టారర్ లో కూడా అమ్మడు నటిస్తుందని అంటున్నారు. గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మళ్లీ రావా తర్వాత దర్శకుడు గౌతం చేస్తున్న ఈ మూవీలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. 



Related Post

సినిమా స‌మీక్ష