పెళ్లిచూపులు దర్శకుడితో ఎన్టీఆర్..!

June 23, 2018


img

పెళ్లిచూపులు సినిమాతో దర్శకుడిగా సూపర్ టాలెంట్ చూపించిన తరుణ్ భాస్కర్ రెండో ప్రయత్నంగా ఈనగరానికి ఏమైంది సినిమా చేశాడు. సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమా జూన్ 29న రిలీజ్ కు సిద్ధమైంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ భారీగానే చేస్తున్నారు. యూఎస్ లో సత్తా చాటిన పెళ్లిచూపులు దర్శకుడిగా తరుణ్ భాస్కర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది.

ఇక ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవగా ఈమధ్య తరుణ్ భాస్కర్ ఎన్.టి.ఆర్ ను కలవడం అందరిని ఆశ్చర్యపరచింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న అరవింద సమేత సెట్స్ కు వెళ్లి మరి ఎన్.టి.ఆర్ తో చాలాసేపు మాట్లాడాడట తరుణ్ భాస్కర్. యువ దర్శకులను ఎంకరేజ్ చేసే తారక్ తరుణ్ తో డిస్కషన్ ఏదైనా సినిమా గురించి అయ్యుంటుందని అందరు ఆరా తీస్తున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష