మెగా హీరోలతో గోపిచంద్ ఫైట్..!

June 16, 2018


img

మాస్ హీరోగా కొన్నాళ్లు సత్తా చాటిన గోపిచంద్ ఈమధ్య వరుస ఫ్లాపులను ఎదుర్కుంటున్నాడు. లేటెస్ట్ గా గోపిచంద్ హీరోగా చక్రవర్తి డైరక్షన్ లో వస్తున్న సినిమా పంతం. ఈ సినిమాతో బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధమయ్యాడు గోపిచంద్. అది కూడా మెగా హీరోలతో గోపిచంద్ పోటీకి దిగుతున్నాడు. జూలై 6న పంతం రిలీజ్ ఫిక్స్ చేశారు. అదే రోజు మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ కరుణాకరణ్ డైరక్షన్ లో వస్తున్న తేజ్ ఐలవ్యూ రిలీజ్ చేస్తున్నారు.

అదే కాకుండా మెగాస్టార్ చిన్నళ్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న విజేత సినిమాను కూడా జూలై న ఫిక్స్ చేశారు. మెగా హీరోల సినిమాలు క్లాష్ అవకుండా ఇద్దరిలో తేజూ సినిమాను వాయిదా వేస్తారని తెలుస్తుంది. ఇక జూలై 6న విజేత పక్కా వస్తుంది. గోపిచంద్ తో మెగా అల్లుడు పోటీ పడుతున్నారు. మరి ఇద్దరిలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష