ఆ డైరక్టర్ కు తెలిసొచ్చిందా..!

June 14, 2018


img

మొదటి రెండు సినిమాలు హిట్టు కొట్టగానే తీసే మూడో సినిమా ఎలా తీసినా ఆడేస్తుంది అనుకున్నాడో ఏమో రవితేజతో కళ్యాణ్ కృష్ణ తీసిన నేల టిక్కెట్టు ఆడియెన్స్ కు షాక్ ఇచ్చింది. ఈ సినిమా బిజినెస్ లో సగం కూడా కలక్షన్స్ రూపంలో తీసుకురాలేకపోయింది. నేల టిక్కెట్టు సినిమా పరమ రొటీన్ సినిమా అని రివ్యూయర్స్ కూడా విమర్శించారు. వరుసగా రెండు హిట్లు కొట్టిన కళ్యాణ్ కృష్ణ రివ్యూయర్స్ ను తప్పుబట్టాడు.

సరిగా సినిమా చూడటం రాని వాళ్లు రివ్యూ రాస్తున్నారంటూ కామెంట్స్ చేశాడు. ఇక సినిమా ఫైనల్ రిజల్ట్ తెలుసుకుని సైడయిపోయాడు. అయినా బాగున్న సినిమా బాగాలేదని రివ్యూస్ ఇచ్చినా ఆడియెన్స్ ఆ సినిమా హిట్ చేస్తారు. మరి నేల టిక్కెట్టు రివ్యూస్ సరిగా ఇవ్వకున్నా ఆడియెన్స్ ఇచ్చిన రివ్యూలకు దర్శకుడికి బాగా తెలిసి వచ్చిందని అంటున్నారు.  



Related Post

సినిమా స‌మీక్ష