అన్న నిర్మాణంలో ఎన్టీఆర్..!

June 13, 2018


img

కళ్యాణ్ రామ్ స్థాపించిన ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో అతను మాత్రమే హీరోగా సినిమాలు చేస్తూ వచ్చాడు. కొద్దిగా లాసులు ఉన్న కారణం చేత జూనియర్ తో జై లవ కుశ సినిమా తీసి మళ్లీ గట్టేక్కాడన్న టాక్ ఉంది. అన్న నిర్మాణంలో తమ్ముడు చేసిన ఆ సినిమా నందమూరి ఫ్యాన్స్ ను మాత్రమే కాదు సిని ప్రియులను అలరించింది. జై లవ కుశలో తన నట విశ్వరూపం చూపించాడు తారక్. 

అయితే ఇప్పుడు మరోసారి తారక్ తో సినిమా చేస్తా అంటున్నాడు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం నా నువ్వే ప్రమోషన్స్ లో ఉన్న కళ్యాణ్ రామ్ త్వరలోనే పవన్ సాధినేని డైరక్షన్ లో సినిమా చేస్తాడని కన్ఫాం చేశారు. ఆ సినిమా ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లోనే ఉంటుందట. అంతేకాదు తారక్ తో సినిమా కూడా వచ్చే ఏడాది మొదలవుతుందని చెబుతున్నాడు కళ్యాణ్ రాం. మరి ఓ పక్క తారక్ మరో రెండేళ్ల దాకా బిజీ షెడ్యూల్ తో ఉన్నాడు. ఈ టైం లో తారక్ తో సినిమా అంటున్న కళ్యాణ్ రామ్ మాటలు ఫ్యాన్స్ ను కన్ ఫ్యూజ్ చేస్తున్నాయి.    Related Post

సినిమా స‌మీక్ష