బన్ని ప్లాన్ అదిరిపోయింది..!

June 13, 2018


img

నా పేరు సూర్య తర్వాత బన్ని ఏ సినిమా ఎనౌన్స్ చేయకుండానే పారిస్ చెక్కేశాడు. ప్రస్తుతం జాలీ ట్రిప్ లో ఉన్న బన్ని తర్వాత సినిమా గురించి రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయితే బన్ని సినిమా కన్ఫాం చేసుకున్నాకే వెకేషన్స్ కు వెళ్లాడని తెలుస్తుంది. కొన్నాళ్లుగా అనుకుంటున్నట్టుగానే విక్రం కె కుమార్ తోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

ఈ సినిమా తర్వాత త్రివిక్రం తో సినిమా కూడా లైన్ లో పెట్టాడట బన్ని. ఎన్.టి.ఆర్ తో అరవింద సమేత పూర్తి కాగానే బన్నితో సినిమా చేస్తాడట త్రివిక్రం. ఇక ఈ ఇద్దరి తర్వాత సురేందర్ రెడ్డి సినిమాను లైన్ లో ఉంచాడట బన్ని. రేసుగుర్రం కాంబినేషన్ లో సినిమా అంటే ఆడియెన్స్ లో కూడా సూపర్ క్రేజ్ ఏర్పడుతుంది. అదిగాక సైరా తర్వాత సూరి సినిమా అంటే ఆ రేంజ్ వేరేలా ఉంటుంది. సో ఇలా ముగ్గురు దర్శకులతో చర్చలు జరిపిన తర్వాతనే బన్ని పారిస్ వెళ్లాడట. ఇక వచ్చి రాగానే విక్రం కె కుమార్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది. ఏమో అనుకున్నాం కాని బన్ని కూడా భారీ ప్లాన్ లోనే ఉన్నాడని చెప్పొచ్చు.Related Post

సినిమా స‌మీక్ష