వన్స్ మోర్ ఎన్టీఆర్..!

May 25, 2018


img

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కలిసి మొదటిసారి చేస్తున్న సినిమా అరవింద సమేత. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సినిమాలో సర్ ప్రైజ్ ఏంటంటే ఎన్.టి.ఆర్ కూడా ఓ పాట పాడుతున్నాడట. తన సినిమాలో హీరోలతో ఓ పాట పాడించడం త్రివిక్రం కు అలావాటే.

ఈసారి అరవింద సమేతకు ఎన్.టి.ఆర్ గొంతు సరిచేసుకుంటున్నాడు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందిస్తున్న ఈ పాటకు త్రివిక్రం డైరక్షన్ ది కపోజర్స్ డ్రీం అంటూ తమన్ వీరందరు కలిసి ఉన్న పిక్ ను షేర్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఈమధ్య దేవికి బాగా డిమాండ్ పెరగడంతో స్టార్ సినిమాలకు తమన్ కూడా ప్రత్నామ్నాయం మారాడు.  



Related Post

సినిమా స‌మీక్ష