మహానటిలో మిస్సమ్మ.. ఎందుకు తీశారబ్బా..!

May 25, 2018


img

సావిత్రి జీవిత కథతో వచ్చిన మహానటి సినిమా అఖండ విజయాన్ని అందుకుంది. పాతిక కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 30 కోట్ల కలక్షన్స్ కలెక్ట్ చేయగా శాటిలైట్ రూపంలోనే బడ్జెట్ మొత్తం కవర్ చేసింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డిలీటెడ్ సీన్స్ రిలీజ్ చేస్తున్నారు. మిస్సమ్మ సినిమాలోని రావోయి చందమామ సాంగ్ రిలీజ్ చేశారు.

ఈ సాంగ్ లో మరోసారి సావిత్రి అభినయంతో కీర్తి సురేష్, జెమిని గణేషన్ గా దుల్కర్ సల్మాన్ అద్భుతంగా నటించారు. సినిమాలో నటించిన వీరిద్దరికి ఇప్పటికే మంచి పేర్లు రాగా ఈ మిస్సమ్మ సాంగ్ ను చూసి ఈ పాటను ఎందుకు తీసేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. మహానటిలో మిస్సమ్మ కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది. 





Related Post

సినిమా స‌మీక్ష