ఈసారీ ఫిల్మ్ ఫేర్ కొట్టేశాడు..!

May 24, 2018


img

వరుస సూపర్ హిట్ లతో కేవలం ఇండస్ట్రీ రికార్డులనే కాదు అవార్డులను అందుకుంటున్నాడు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. ఆల్రెడీ 2016లో నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్న తారక్ ఈ ఇయర్ కు ఫిల్మ్ ఫేర్ అందుకుంటున్నాడు. 2017లో జై లవ కుశతో ట్రిపుల్ రోల్ లో నట విశ్వరూపం చూపించిన తారక్ రికార్డులు, రివార్డులే కాదు అవార్డులను అందుకుంటున్నాడు. 

కె.ఎస్ రవింద్ర (బాబి) డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాన్ రామ్ నిర్మించడం జరిగింది. జై, లవ, కుశ మూడు పాత్రల్లో జై పాత్రలో ఎన్.టి.ఆర్ అదరగొట్టాడు. కొన్నాళ్లు కెరియర్ పరంగా హిట్ సినిమాకు దూరంగా ఉన్న తారక్ హిట్ ట్రాక్ ఎక్కడమే కాదు వరుస అవార్డులను సొంతం చేసుకుంటున్నాడు. జూన్ 16న నోవాటెల్ లో 65వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వేడుక జరుగనుంది.  



Related Post

సినిమా స‌మీక్ష