ఈ టైంలో పూరితో సినిమానా..?

May 22, 2018


img

ప్రస్తుతం యువ దర్శకులే కొత్త కథలతో వరుస సక్సెస్ లతో దూసుకెళ్తుంటే ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లు కొట్టిన పూరి జగన్నాథ్ మాత్రం వెనుక పడిపోయాడు. లేటెస్ట్ గా తనయుడు ఆకాష్ పూరి హీరోగా చేసిన మెహబూబా కూడా నిరాశ పరచడంతో మరింత రిస్క్ లో పడ్డాడు పూరి. అయితే ఇలాంటి టైంలో పూరికి ఛాన్స్ ఇస్తున్నాడట కింగ్ నాగార్జున. పూరి డైరక్షన్ లో శివమణిగా సంచలన విజయం అందుకున్నాడు నాగార్జున.

ఆ తర్వాత 13 ఏళ్లకు మళ్లీ పూరి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే వర్మతో నాగ్ చేసిన ఆఫీసర్ మీదే డౌట్ కలుగుతుంటే ఇప్పుడు ఏకంగా శిష్యుడు పూరితో కూడా నాగార్జున మరో ప్రయోగం చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఈమధ్యనే నాగార్జునకు కథ చెప్పడం ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. ప్రస్తుతం శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో నానితో కలిసి మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్న నాగార్జున పూరితో ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష