వచ్చాడండి అరవింద సమేత వీర రాఘవా..!

May 19, 2018


img

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రం కాంబినేషన్ లో మొదటిసారిగా వస్తున్న సినిమాకు టైటిల్ గా అరవింద సమేత వీర రాఘవ అని పెట్టారు. అరవింద సమేత అన్నది అసలు టైటిల్ కాగా వీర రాఘవ ఉపశీర్షికగా చిన్న లెటర్స్ తో టైటిల్ లో ఉంచారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ లో ఎన్.టి.ఆర్ సిక్స్ ప్యాక్ తో డ్యాషింగ్ లుక్ లో కనిపిస్తున్నాడు. త్రివిక్రం మార్క్ టైటిల్ కనిపిస్తున్నా సినిమా మాత్రం ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ సాటిస్ఫై చేసేలా ఉంటుందని ఫస్ట్ లుక్ చూస్తేనే తెలుస్తుంది.


హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా పూజా హెగ్దె, శ్రద్ధా కపూర్ లు నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో రాఘవగా ఎన్.టి.ఆర్ అరవిందగా హీరోయిన్ పూజా హెగ్దె నటిస్తుందని టైటిల్ ను బట్టి చెప్పొచ్చు. మరి ఫస్ట్ లుక్ తో అంచనాలు పెంచిన ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. 



Related Post

సినిమా స‌మీక్ష