పాపం పూరి జగన్నాథ్..!

May 15, 2018


img

ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్ కొడితేనేం ఇప్పుడు తన సినిమాకు ఆడియెన్స్ కరువయ్యారని ఇండైరెక్ట్ గా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాడు డైరక్టర్ పూరి జగన్నాథ్. ఆయన దర్శకత్వంలో ఆయన తనయుడు ఆకాష్ పూరి హీరోగా వచ్చిన సినిమా మెహబూబా. మే 11న రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయినా సరే థ్యాంక్స్ మీట్ జరుపుకున్న పూరి ఈవెంట్ లో భాగంగా ప్రేక్షకులను తమ సినిమా చూడాలని కోరుకున్నారు.

సినిమాకు బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి.. అయినా సరే అందరు ఆకాష్ నటనను మెచ్చుకున్నారు. తాను రొటీన్ సినిమాలు చేస్తే పూరి మారట్లేదని అన్నారు. కాని మారి మంచి సినిమా తీస్తే పూరి మార్క్ మిస్ అయ్యిందని అంటున్నారు. కామెడీ, ఐటం సాంగ్ లేకుండా చేసిన ప్రేమకథ ఇదని తన కెరియర్ లో బెస్ట్ ఫిల్మ్ ఇదని అని చెప్పుకొచ్చాడు పూరి. 

రివ్యూలెలా ఉన్నా ఆకాష్ యాక్టింగ్ గురించి పాజిటివ్ గా రాశారు. యూఎస్ నుండి మంచి స్పందన వస్తుంది. మెహబూబాకు మీ ఆదరణ కావాలని ఆడియెన్స్ ని కోరుకుంటున్నాడు పూరి. Related Post

సినిమా స‌మీక్ష