సావిత్రితో ఫోటో అప్పుడు లేదు.. కాని ఇప్పుడు..!

May 15, 2018


img

ప్రతిభ గల సీనియర్ దర్శకులలో సిగీతం శ్రీనివాస్ ఒకరు. కె.వి రెడ్డి దగ్గర దర్శకత్వ పాఠాలు నేర్చుకున్న ఆయన మహానటి సినిమాలో ఉన్నారు. కె.వి రెడ్డి దగ్గర సహాయక దర్శకుడిగా చేసిన సింగీతం శ్రీనివాస్ మహానటి సావిత్రి అభినయం ప్రత్యక్షంగా చూసే అదృష్టం కలిగింది. అయితే ఆ టైంలో సావిత్రితో దిగిన ఫోటో ఏదైనా ఉందా అని చాలామంది అడిగేవారట. 


అప్పుడు లేదని సమాధానం చెప్పిన సింగీతం మహానటి రిలీజ్ తర్వాత తన దగ్గర సావిత్రితో దిగిన ఫోటో ఉందని చెబుతానని అంటున్నారు. మహానటి సినిమాలో సావిత్రి పాత్ర పోశించిన కీర్తి సురేష్ తో ఫోటో దిగిన సింగీతం సావిత్రితో తాను అంటూ ఫోటో షేర్ చేశారు. అంత గొప్ప దర్శకుడి చేత సావిత్రి తర్వాత సావిత్రి అనిపించుకున్న కీర్తి సురేష్ ఎంత క్రేజ్ సంపాదించుకుందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.  

 


Related Post

సినిమా స‌మీక్ష