వీరనారిగా తమన్నా.. సైరాలో సర్ ప్రైజ్ రోల్..!

April 25, 2018


img

బాహుబలి బిగినింగ్ లో అవంతికగా అదరగొట్టిన తమన్నా సెకండ్ పార్ట్ లో అంత ప్రాముఖ్యత సంపాదించలేకపోయింది. ఇక కెరియర్ కాస్త అటు ఇటుగా సాగుతున్న ఈ తరుణంలో అమ్మడికి ఓ బంపర్ ఆఫర్ తగిలినట్టు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా చేస్తున్న సైరా నరసింహారెడ్డి మూవీలో తమన్నా నటిస్తుందని తెలుస్తుంది. ముందు ఈ సినిమాలో తమన్న అనగానే అందరు ఐటం సాంగ్ కోసం అనుకున్నారు కాని సినిమాలో మిల్కీ బ్యూటీ వీరనారిగా కనిపించనుందట.

సైరాలో తమన్నా సర్ ప్రైజ్ చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. వీరనారిగా తమన్నా ఎలా సత్తా చాటుతుందో చూడాలి. బాహుబలి బిగినింగ్ లో అవంతికగా ఉన్న తన పోర్షన్ వరకు బాగానే టాలెంట్ చూపించి తమన్నా. మరి సైరాలో కూడా అమ్మడికి అంతకుమించిన క్రేజ్ రావాలని ఆశిద్దాం.Related Post

సినిమా స‌మీక్ష