రా అండ్ రియల్.. ముగ్గురు సూపర్ స్టార్స్..!

April 25, 2018


img

స్టార్ ఎలా ఉన్నా సరే వారి ఫ్యాన్స్ మధ్య మాత్రం గొడవలు వస్తూనే ఉంటాయి. మా హీరో గొప్ప అంటూ మా హీరో గొప్ప అంటూ ఎప్పుడూ దెబ్బలాడుతుంటారు అయితే వీటికి ఫుల్ స్టాప్ పెట్టేలా స్టార్స్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. దానికి ఫస్ట్ స్టెప్ గా సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. 

ఇక ఆ తర్వాత పార్టీలో వీరితో రాం చరణ్ కూడా జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ గా భరత్ సక్సెస్ తర్వాత మళ్లీ మహేష్, ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి దిగిన పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నిన్న సాయంత్రం ఓ పార్టీలో ఈ ముగ్గురు కలిసినట్టు తెలుస్తుంది. ఇక ఈ ముగ్గురు కలిసి దిగిన పిక్ షేర్ చేస్తూ నమ్రత రా అండ్ రియల్ అంటూ మెసేజ్ పెట్టింది. 

ఈ ముగ్గురు స్టార్ ఫ్యాన్స్ కు మంచి సందేశాన్ని ఇస్తున్నట్టు తెలుస్తుంది. రంగస్థలంతో చరణ్, భరత్ అనే నేను తో మహేష్ సక్సెస్ కొట్టినందుకు ఇద్దరిని కంగ్రాట్స్ చేస్తూ తారక్ న్యూ లుక్ లో దర్శనమిచ్చాడు.



Related Post

సినిమా స‌మీక్ష