భరత్ లో మరికొన్ని సీన్స్..!

April 25, 2018


img

సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ రిలీజ్ భరత్ అనే నేను బాక్సాఫీస్ దగ్గర తన వీర ప్రతాపం చూపిస్తుంది. ఇప్పటికే 125 కోట్ల గ్రాస్ కలక్షన్స్ తో దూసుకెళ్తున్న భరత్ అనే నేను సినిమా వసూళ్ల హంగామా మరింత పెంచాలని చూస్తున్నారు చిత్రయూనిట్. ఇక సినిమా దర్శకుడు కొరటాల శివ సెంటిమెంట్ ప్రకారం సినిమాలో మరికొన్ని సీన్స్ యాడ్ చేస్తున్నారట.

మహేష్, శివ కాంబోలో వచ్చిన శ్రీమంతుడు సినిమాకు కూడా ఇలానే రెండో వారంలో కొన్ని సీన్స్ యాడ్ చేశారు. ఇప్పుడు భరత్ అనే నేను సినిమాకు కొన్ని సీన్స్ యాడ్ చేస్తున్నారట. అందులో హోలీ ఫైట్ సీన్ ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం రెండు గంటల 53 నిమిషాలు ఉన్న భరత్ అనే నేను మరో 7 నిమిషాల దాకా కలుపుతారని తెలుస్తుంది.

డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో మహేష్ సిఎంగా అదరగొట్టాడు. యంగ్ సిఎం వచ్చి సొసైటీని ఎలా మార్చాడన్న కథతో భరత్ అనే నేను సినిమా వచ్చింది. రిలీజ్ అయిన మొదటి షో నుండి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ మహేష్ కెరియర్ లో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుందని చెప్పొచ్చు.Related Post

సినిమా స‌మీక్ష