మహేష్ ఏంటి ఇంత జోష్..!

April 24, 2018


img

బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయే సరికి మహేష్ లేటెస్ట్ రిలీజ్ భరత్ అనే నేను సినిమా సూపర్ హిట్ టాక్ ఆయనకు మంచి జోష్ ఇచ్చినట్టు ఉంది. రిలీజ్ తర్వాత మహేష్ చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. ఇక నిన్న జరిగిన థ్యాంక్స్ మీట్ లో కూడా మహేష్ చాలా ఆనందంగా కనిపించారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సినిమాలో యంగ్ సిఎంగా మహేష్ కనిపించారు.

ఇక ఈ సినిమాతో మహేష్ మరోసారి తన స్టామినా ఏంటో చూపించాడు. థ్యాంక్స్ మీట్ లో మాట్లాడుతూ సినిమా రిలీజ్ కు ముందు చాలా టెన్షన్ ఫీల్ అయ్యానని.. రిలీజ్ నాడు రెండున్నరకు యూఎస్ నుండి టాక్ తెలియగానే రిలాక్స్ అనిపించిందని అన్నారు మహేష్. తన ఫ్యాన్స్ కు నచ్చే సినిమాలు తీయడం లేదని.. భరత్ అనే నేను నచ్చిందని వారికి నచ్చిన సినిమాలనే ఇక నుండి చేస్తానని చెప్పారు మహేష్.



Related Post

సినిమా స‌మీక్ష