అనసూయకు మరో లక్కీ ఛాన్స్..!

April 24, 2018


img

యాంకర్ గా బుల్లితెర ఆడియెన్స్ ను అలరిస్తూనే వెండితెర మీద తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న అమ్మడు అనసూయ రీసెంట్ గా రంగస్థలం లో మంచి పాత్రే చేసింది. రంగమ్మత్తగా అనసూయ చాలా మంచి అభినయం కనబరచింది. అనసూయలో ఇంత నటీమణి ఉందని ఆ పాత్ర చూసేదాకా ఎవరికి తెలియదు. ఇక ఆ తర్వాత కూడా బోయపాటి శ్రీను సినిమాలో చరణ్ మరో ఛాన్స్ ఇప్పించాడని అంటున్నారు.

ఇక అదే కాకుండా అనసూయ మరో క్రేజీ ఆఫర్ సొంతం చేసుకుంది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీలో కూడా అనసూయ ఓ ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుందట. సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు ఎఫ్-2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) అని టైటిల్ ఫిక్స్ చేశారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.



Related Post

సినిమా స‌మీక్ష