నా సినిమాకు రేటింగులొద్దు..!

April 23, 2018


img

ఛలోతో హిట్ అందుకున్న నాగ శౌర్య లేటెస్ట్ గా నటించిన సినిమా అమ్మగారిల్లు. ఈ సినిమా టీజర్ రిలీజ్ కార్యక్రమంలో మాట్లాడిన నాగ శౌర్య ఇది అమ్మమ్మతో అనుబంధం ఆధారంగా తీసిన సినిమా అని కాబట్టి ఈ సినిమా చూశాక రేటిగులు ఇవ్వొద్దని అన్నాడు నాగ శౌర్య. అమ్మమ్మగారిల్లు ఓ గుడి లాంటిదని.. గుడికి వెళ్లినప్పుడు శత్రువులు కనబడినా గొడవపడకుండా దర్శనం చేసుకుని వస్తామని అలానే అమ్మగారింటికి వెళ్లినా సరే కుటుంబంలో వ్యక్తుల మధ్య మనస్పర్ధలు ఉన్నా ఆమె బాధపడకూడదని నవ్వుతూ ఉంటామని చెప్పాడు నాగ శౌర్య.

తనకు తన అమ్మమ్మ వాళ్ల ఇంటితో చాలా అనుబంధం ఉండేదని.. ఈ సినిమా మళ్లీ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసిందని అన్నారు. ఇది రేటింగులిచ్చే సినిమా కాదు దయచేసి ఈ సినిమాకు రేటింగులు ఇవ్వొద్దని మీడియాను కోరాడు నాగ శౌర్య. నాగ శౌర్య, షామిలి జంటగా నటించిన ఈ సినిమాను సుందర్ సూర్య డైరెక్ట్ చేశారు. కళ్యాణ్ రమణి మ్యూజిక్ అందించిన ఈ సినిమా రాజేష్ నిర్మిస్తున్నారు. త్వరలో రిలీజ్ అవబోతున్న ఈ సినిమా టీజర్ పై మంచి రెస్పాన్స్ వస్తుంది. 



Related Post

సినిమా స‌మీక్ష