ఇంటర్వెల్ ముందు చరణ్.. తర్వాత ఎన్టీఆర్..!

April 23, 2018


img

బాహుబలి తర్వాత రాజమౌళి ఆ అంచనాలకు తగినట్టుగా మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు. మెగా నందమూరి క్రేజీ కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుంది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇందులో హీరోలుగా నటిస్తున్నారు. ఇద్దరు స్టార్స్ ఒకే వేదిక మీద కనిపిస్తేనే పండుగ చేసుకునే అభిమానులు ఒకే సినిమాలో నటిస్తే ఇక ఆ సినిమా రేంజ్ ఎలా ఉంటుందో ఊహించవచ్చు.

రాజమౌళి చేయబోతున్న ఈ ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ కు సంబందించి రోజుకో న్యూస్ హల్ చల్ చేస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా ఒకరోజు జరిగే సంఘటనలే అని తెలుస్తుంది. ఇప్పటికే హార్ రైడర్ గా చరణ్, బాక్సర్ గా ఎన్.టి.ఆర్ కనిపిస్తున్నారని తెలిసిందే. ఇక ఇంటర్వల్ కు ముందు చరణ్.. ఇంటర్వల్ తర్వాత ఎన్.టి.ఆర్ కనిపిస్తారట. చూస్తుంటే రాజమౌళి ట్రిపుల్ ఆర్ మరో సంచలన సినిమా అవుతుందని అనిపిస్తుంది.

డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ట్రిపుల్ ఆర్ తో రాజమౌళి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో అని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.



Related Post

సినిమా స‌మీక్ష