చేసిందంతా చేసి.. పైన కవర్ చేస్తున్నాడా..!

April 19, 2018


img

కాస్టింగ్ కౌచ్ మీద శ్రీరెడ్డి నిరసనకు కొంతమంది సిని సెలబ్రిటీస్ కూడా ఆమెకు సపోర్ట్ గా నిలిచారు. అయితే అక్కడితే ఆగకుండా వ్యవహారం మరింత వేడెక్కేందుకు శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసింది. పవన్ తల్లిని కూడా తిట్టింది. అప్పటినుండి టాలీవుడ్ అంతా శ్రీరెడ్డి మీద నిప్పులు చెరుగుతుంది. అయితే ఇదంతా శ్రీరెడ్డితో సంచలన దర్శకుడు వర్మ చేయించాడని ఒప్పుకున్నాడు.

అంతేకాదు దానికి సంబందించి విషయాన్ని వివరిస్తూ ఓ వీడియో కూడా వదిలాడు. వర్మ ఇన్నాళ్లు చేసిన కామెంట్లు ఒక ఎత్తైతే ఇప్పుడు శ్రీరెడ్డి విషయంలో జోక్యం చేసుకోవడం మాత్రం తప్పేనని అంటున్నారు. కాస్టింగ్ కౌచ్ మీద ఆమె చేస్తున్న పోరాటానికి మద్ధతిచ్చిన వర్మ పవన్ ను అన్న మాటలను సమర్ధిస్తూ చెప్పుకొచ్చాడు. పర్టిక్యులర్ మనిషి ఆగ్రహావేశాల్లో ఏం మాట్లాడాలో తెలియక అలా అనేసిందని అంటున్నాడు. 

దీనికి ఉదహరణ అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ కూడా ఆ బూతు మాట ప్రస్థావించాడని అన్నాడు. పవన్ అభిమాని అంటూ పవన్ కే ఎసరు పెడుతున్న వర్మ తన ఆలోచన ఏంటో ఎవరికి అర్ధం కావట్లేదు. ఓ పక్క పవన్ ను ఏకేసే సలహాలిస్తూ ఆయన నా అభిమాన నటుడు అతను సిఎం కావాలని చెబుతూ నాటకాలాడుతున్నాడని అంటున్నారు. 

సురేష్ తనయుడు అభిరాం విషయంలో కూడా శ్రీరెడ్డికి 5 కోట్లతో సెటిల్మెంట్ కూడా చేశాడని అంటున్నారు. శ్రీరెడ్డి మాత్రం ఆ వ్యవహారం సెటిల్ చేసుకునేందుకు వర్మ తననే 5 కోట్లు డిమాండ్ చేయమన్నాడని చెప్పుకొచ్చింది. ఏటొచ్చి మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వర్మ శ్రీరెడ్డి విషయంలో తలదూర్చి చెడ్డపేరు తెచ్చుకుంటున్నాడని చెప్పొచ్చు. 

 


Related Post

సినిమా స‌మీక్ష