నాని కోసం అలాంటి కథ..!

April 17, 2018


img

వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న నానికి లేటెస్ట్ రిలీజ్ కృష్ణార్జున యుద్ధం రిజల్ట్ తేడా కొట్టేసింది. మేర్లపాక గాంధి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా నాని హిట్ మేనియాకు బ్రేక్ వేసినట్టే. అయితే ఈ సినిమా ఫలితం నానిని ఆలోచనలో పడేసింది. ప్రస్తుతం ఐదారు కథలను లైన్ లో పెట్టిన నాని కృష్ణార్జున యుద్ధం తర్వాత విక్రం కె కుమార్ సినిమా చేస్తున్నాడట. 

24 తర్వాత హలో సినిమా చేసిన విక్రం కె కుమార్ నాని కోసం ఓ ప్రయోగాత్మక కథ సిద్ధం చేశాడట. లైన్ విన్న నాని ఓకే అనేశాడట. ఈ సినిమా కూడా 24 సినిమాలా థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ఉంటుందట. ఇన్నాళ్లు నాని హిట్ కొడుతున్నా రొటీన్ అన్న టాక్ వచ్చింది. అందుకే విక్రం కుమార్ తో నాని కచ్చితంగా మంచి సినిమానే వస్తుందని ఆశిస్తున్నారు.  



Related Post

సినిమా స‌మీక్ష