బోయపాటి చరణ్.. అప్పుడే వచ్చేస్తారట..!

April 16, 2018


img

రంగస్థలం సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఆ తర్వాత బోయపాటి శ్రీను సినిమా చేస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో భరత్ అనే నేను హీరోయిన్ కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. అసలైతే ఈ సినిమా దసరా కల్లా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కాని చరణ్ రంగస్థలం లేట్ అవడం వల్ల ఆ ఎఫెక్ట్ బోయపాటి సినిమా మీద పడ్డది.   

మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ చెబుతున్నారు. 2019 సంక్రాంతి బరిలో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. సరైనోడు సినిమాతో మెగా హీరోలకు మెమరబుల్ హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీను రాం చరణ్ కు ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. రంగస్థలం సినిమాతో నాన్ బాహుబలి రికార్డులను క్రాస్ చేసి మరోసారి బాక్సాఫీస్ రికార్డులను తన మీద రాసుకున్నాడు రాం చరణ్. Related Post

సినిమా స‌మీక్ష