మళ్లీ 1 నేనొక్కడినే కాంబో.. ఈసారి హిట్ పక్కా..!

April 13, 2018


img

సూపర్ స్టార్ మహేష్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 1 నేనొక్కడినే సినిమా గుర్తుండే ఉంటుంది. మహేష్ నటన హైలెట్ గా ఉన్నా సుక్కు కన్ ఫ్యూజ్ స్క్రీన్ ప్లే సినిమాకు మైనస్ అయ్యింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్నా సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఫెయిల్ అయ్యింది. నేనొక్కడినే తర్వాత ఎన్.టి.ఆర్ తో నాన్నకు ప్రేమతో, రాం చరణ్ తో రంగస్థలం తీసి సూపర్ సక్సెస్ అందుకున్నాడు సుకుమార్.

రంగస్థలం నిర్మాతలు మైత్రి మేకర్స్ మళ్లీ సుకుమార్ కు అడ్వాన్స్ ఇచ్చారట. ఇక ఈ సినిమాలో హీరోగా సూపర్ స్టార్ మహేష్ పేరు వినిపిస్తుంది. మహేష్, సుక్కు కాంబో మళ్లీ సెట్ అవుతుంది. మహేష్ కు ఓ హిట్ బాకీ ఉన్నా అని ఎప్పుడు చెబుతుంటే సుకుమార్ మరి ఈసారైనా మహేష్ ఫ్యాన్స్ కోరుకునే బ్లాక్ బస్టర్ హిట్ అందిస్తాడేమో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష