మెగాస్టార్ తో మైత్రి మేకర్స్..!

April 11, 2018


img

ఖైది నంబర్ 150 సినిమాతో పదేల్ల గ్యాప్ తర్వాత అయినా తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి ఎవరితో చేస్తాడు అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.  

డైరక్టర్ ఎవరన్నది తెలియదు కాని రంగస్థలం నిర్మాతలతో చిరంజీవి తర్వాత సినిమా ఉంటుందని మాత్రం తెలుస్తుంది. ఇప్పటికే దానికి సంబందించిన అగ్రిమెంట్ కార్యక్రమాలు పూర్తయ్యాయట. మెగాస్టార్ తో మైత్రి మూవీ మేకర్స్ కచ్చితంగా భారీ సినిమానే వస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు దర్శకుడిగా బోయపాటి శ్రీను పేరు వినిపిస్తుంది. మరి అది ఎంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.  Related Post

సినిమా స‌మీక్ష