రంగస్థలం ట్రైలర్.. ఇదో మాస్టర్ పీస్..!

March 19, 2018


img

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా రంగస్థలం. ఈ నెల 30న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా నిన్న ఉగాది సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరిపారు. ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి రాగా చిత్రయూనిట్ అంతా ఈ వేడుకలో పాల్గొంది. ఇక ఈ సందర్భంగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. చిట్టిబాబుగా చరణ్ సింప్లీ సూపర్బ్ అని చెప్పొచ్చు. 

సినిమాలో ప్రతి అంశం ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించేలా డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. ట్రైలర్ లో ముఖ్యంగా రాం చరణ్ నట విశ్వరూపం చూపించాడు. సినిమా కచ్చితంగా చరణ్ కెరియర్ లో ప్రత్యేకంగా ఉంటుందని చెప్పొచ్చు. ట్రైలర్ చూస్తే ఈ సినిమా కచ్చితంగా ఓ మాస్టర్ పీస్ అనేలా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సినిమాకు మ్యూజిక్ అందించారు.





Related Post

సినిమా స‌మీక్ష