ఉగాదికి రంగస్థలం హంగామా..!

March 15, 2018


img

రాం చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న రంగస్థలం సినిమా ఈ నెల 30న రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న ఈ సందర్భంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 18న వైజాగ్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఉగాదికి చరణ్ రంగస్థలం హంగామా మొదలు కానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది.

పల్లెటూరి ప్రేమకథగా రాబోతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. రిలీజ్ పది రోజుల ముందే హంగామా మొదలు పెట్టేస్తున్న చరణ్ రంగస్థలంతో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకుంటాడేమో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష