అన్న దారిలోకి రాక తప్పలేదా..!

March 13, 2018


img

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పుడంటే ఫ్లాపుల్లో ఉన్నాడు కాని ఇండస్ట్రీ హిట్లు కొట్టిన సినిమాలు కూడా డైరెక్ట్ చేశాడు పూరి. అయితే ఇంట్లోనే టాప్ డైరక్టర్ ఉన్నా హీరోగా ఛాన్స్ వచ్చినా సరే టాలెంట్ చూపించలేకపోయాడు పూరి తమ్ముడు సాయిరాం శంకర్. పూరి సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ వేసి 143, బంపర్ ఆఫర్ సినిమాలతో హీరోగా ప్రమోట్ అయిన సాయిరాం శంకర్ హీరోగా ఫెయిల్యూర్ అయ్యాడు.

అందుకే ఇప్పుడు అన్న దారిలోనే మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం సాయిరాం శంకర్ హీరోగా ఓ సినిమా వస్తుంది ఆ సినిమా పూర్తి కాగానే తన డైరక్షన్ లో ఓ సినిమా మొదలు కానుందట. ఎన్నాళ్లగానో దర్శకుడి అవ్వాలన్న కలను నిజం చేసుకుంటున్నాడు సాయిరాం శంకర్. మరి హీరోగా ఫెయిల్ అయిన సాయిరాం శంకర్ డైరక్టర్ గా అయినా సక్సెస్ సాధిస్తాడో లేదో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష