డిఎస్పి లవ్ లో పడ్డాడా..!

February 24, 2018


img

మ్యూజిక్ మిరకిల్ దేవి శ్రీ ప్రసాద్ లవ్ లో పడ్డాడా.. అంటే అవననే అంటున్నాయి సిని వర్గాలు. మలయాళ భామ పూజితతో డిఎస్పి డీప్ లవ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. సుకుమార్ దర్శకుడు సినిమాలో నటించిన పూజిత ఆ సినిమాలో తన స్క్రీన్ ప్రెజెన్స్ తో సుకుమార్ ను మెప్పించింది. ఇప్పుడు రంగస్థలం లో కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.

రంగస్థలం షూటింగ్ టైంలోనే డిఎస్పి అమ్మడిని చూసి మనసు ఇచ్చేశాడట. దేవి లవ్ ప్రపోజల్స్ కు పూజిత కూడా ఓకే అనేసిందని టాక్. మొత్తానికి సుకుమార్ సినిమా ద్వారా ఈ ఇద్దరు ఒకటవబోతున్నారట. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంతన్నది తెలియాల్సి ఉంది. ఈమధ్య సినిమాలను కూడా తగ్గించేసిన దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి మీద ఫోకస్ పెట్టాడని అంటున్నారు. ఇదవరకు డిఎస్పి పెళ్లి వార్తలపి న్యూసులు వచ్చినా అవేవి నిజం కాలేదు మరి ఇదైనా నిజం అవుతుందో కాదో చూడాలి. 



Related Post

సినిమా స‌మీక్ష