మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తున్నారే..!

February 24, 2018


img

నితిన్ హీరోగా చైతన్య కృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఛల్ మోహన్ రంగ. త్రివిక్రం కథతో వస్తున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో వస్తుండగా.. సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుండి మొదటి సాంగ్ ఈరోజు రిలీజ్ అయ్యింది.

తమన్ మెలోడీ మ్యూజిక్ తో సినిమాకు హిట్ కళ తెచ్చిపెట్టింది ఈ పాట. ఆల్రెడీ లై సినిమాలో నటించిన ఈ జంట మళ్లీ రిపీట్ అవుతుండటం విశేషం. ఏప్రిల్ 5న రిలీజ్ ప్లాన్ చేస్తున్న నితిన్ ఛల్ మోహన్ రంగ ప్రచార చిత్రాలు సినిమాపై మంచి పాజిటివ్ ఇంప్రెషన్ కలిగేలా చేస్తున్నాయి. ఎలాగు త్రివిక్రం కథ కాబట్టి సినిమా కచ్చితంగా పక్కా ఎంటర్టైనర్ అని ఫిక్స్ అవుతున్నారు ప్రేక్షకులు. 





Related Post

సినిమా స‌మీక్ష