రజిని మళ్లోటి మొదలెడుతున్నాడు..!

February 24, 2018


img

సూపర్ స్టార్ రజినికాంత్ పొలిటికల్ ఎంట్రీ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటాడని ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. అయితే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చాక కూడా సినిమా ఎనౌన్స్ మెంట్ చేసి షాక్ ఇచ్చాడు తలైవా. ప్రస్తుతం కాలా, 2.ఓ సెట్స్ మీద ఉండగా.. ఇప్పుడు మరో సినిమాకు ముహుర్తం పెట్టేశాడు. రజిని హీరోగా కళానిధి మారన్ నిర్మాణంలో ఓ సినిమా వస్తుంది.


కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా త్వరలో మొదలు కానుంది. పిజ్జా, జిగుర్తండా, ఇరైవి సినిమాలతో దర్శకుడిగా తన సత్తా చాటిన కార్తిక్ సుబ్బరాజు రజిని ఇమేజ్ కు తగిన కథతో ఇంప్రెస్ చేశాడట. కథ, కథనాలన్ని సినిమా రజిని రేంజ్ మరింత పెంచేలా చేస్తుందని అంటున్నారు. మరి ఈ సినిమాలో మిగతా స్టార్ కాస్ట్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. 



Related Post

సినిమా స‌మీక్ష