సాహోలో అమీ జాక్సన్ కూడా..!

February 23, 2018


img

బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. యువి క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. శంకర్ ఎహసన్ లాయ్ మూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో అమీ జాక్సన్ కూడా కేమియో రోల్ చేస్తుందని అంటున్నారు. 

కేవలం కేమియో రోలేనా లేక ఐటం సాంగా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రోబో సీక్వల్ గా వస్తున్న 2.ఓలో అమీ జాక్సన్ నటిస్తుంది. తమిళంలో ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న అమీ జాక్సన్ బాలీవుడ్ లో కూడా అడపాదడపా సినిమాలు చేస్తుంది. సాహోలో అమీ జాక్సన్ కన్ఫాం అయితే రెబల్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకోవడం ఖాయం.  



Related Post

సినిమా స‌మీక్ష