ఆ ప్రాజెక్ట్ కు తమన్ ఫైనల్..!

February 23, 2018


img

అజ్ఞాతవాసి తర్వాత ఎన్.టి.ఆర్ తో సినిమా చేస్తున్న త్రివిక్రం స్రీనివాస్ మార్చి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూట్ కు సిద్ధమవుతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాబోతున్న ఈ సినిమాకు మొదట అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తాడని అన్నారు. అజ్ఞాతవాసి ఫ్లాప్ అవడంతో అనిరుద్ ని రిపీట్ చేయడం మంచిది కాదని భావించారు. అందుకే ఆ ఛాన్స్ తమన్ కు ఇస్తున్నారట.

ఎన్.టి.ఆర్ తో తమన్ ఇప్పటికే సినిమాలు చేసినా త్రివిక్రం తో మాత్రం తమన్ ఇది మొదటి సినిమా అని చెప్పొచ్చు. ఇక త్రివిక్రం కథగా నితిన్ హీరోగా వస్తున్న ఛల్ మోహన్ రంగ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈమధ్యనే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. మొత్తానికి త్రివిక్రం, ఎన్.టి.ఆర్ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించడం సినిమా అంచనాలను మరింత పెంచింది.



Related Post

సినిమా స‌మీక్ష