చైతుతో మరోసారి రకుల్..!

February 22, 2018


img

అక్కినేని నాగ చైతన్య హీరోగా కృష్ణ వంశీ దగ్గర అసిస్టెంట్ గా చేసిన సౌజన్య డైరక్షన్ ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో చైతు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందట. ఆల్రెడీ చైతు రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటించింది. ఇక ఇప్పుడు మరోసారి ఈ హిట్ పెయిర్ మరోసారి జోడి కట్టబోతున్నారు.

సింపుల్ లవ్ స్టోరీగా స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీగా ఈ సినిమా రాబోతుందట. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ హిట్ పెయిర్ ను మళ్లీ జోడీ చేస్తున్నారు. ప్రస్తుతం చైతు సవ్యసాచి, శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో నటిస్తున్నాడు. 



Related Post

సినిమా స‌మీక్ష