ఆ కమెడియన్ కోసం బాహుబలి రైటర్..!

February 16, 2018


img

కమెడియన్స్ హీరో అవడం కామన్ అయిన ఈరోజుల్లో హీరోగా సక్సెస్ అవడంలోనే అసలు కిక్ ఉందని అంటున్నారు. సునీల్ వేసిన ఈ బాటలో ఇప్పుడు సప్తగిరి నడుస్తున్నాడు. సప్తగిరి ఎక్స్ ప్రెస్, ఎల్.ఎల్.బి సినిమాల ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో ఇక హీరోగానే కంటిన్యూ అయ్యే ఆలోచనలో ఉన్నాడు సప్తగిరి. ఇక ప్రస్తుతం సప్తగిరి కోసం ఏకంగా బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఓ కథ సిద్ధం చేస్తున్నారట.

బాహుబలి రైటర్ గా ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వియేంద్ర ప్రసాద్ సల్మాన్ ఖాన్ భజరంగి భాయ్ జాన్ సినిమాకు కథ అందించాడు. ఇక ఇప్పుడు సప్తగిర్ కోసం ఓ క్రేజీ స్టోరీ రాస్తున్నాడట. 4 నుండి 5 కోట్ల మార్కెట్ ఉన్న సప్తగిరి ఈసారి విజయేంద్ర ప్రసాద్ కథతో బడ్జెట్ కూడా పెంచబోతున్నాడని తెలుస్తుంది. మరి విజయేంద్ర ప్రసాద్ కథతో సప్తగిరి ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష