ఛలో టీంకు కానుకలిస్తున్నాడు..!

February 15, 2018


img

యువ హీరో నాగ శౌర్య, రష్మిక జంటగా నటించిన సినిమా ఛలో. వెంకీ కుడుముల డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా నాగ శౌర్య ఓన్ సొంత బ్యానర్లో నిర్మించారు. ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యి డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు తెచ్చి పెట్టింది. ఇక ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా చిత్రయూనిట్ కు ప్రొడక్షన్ నుండి సర్ ప్రైజ్ కానుకలు ఇస్తున్నారట. వారి వారి కాంట్రిబ్యూషన్ ను బట్టి ఈ కానుకలు ఉంటాయట.

సాధారణంగా ఇలాంటి గిఫ్టుల ఆనవాయితి కోలీవుడ్ లో ఎక్కువగా కనబడుతుంది. అక్కడ హీరో తమ సినిమా హిట్ అయితే చాలు చిత్రయూనిట్ అందరికి గోల్డ్ చైన్స్ ఇచ్చేస్తారు. అయితే నాగ శౌర్య ఎలాంటి కానుకలు ఇస్తాడు అన్న దాని మీద క్లారిటీ రాలేదు. డైరక్టర్ వెంకీకి మాత్రం కాస్ట్ లీ కారు గిఫ్ట్ గా ఇవ్వాలని నిర్ణయించారట. వైజాగ్ లో సక్సెస్ మీట్ జరుపుకున్న ఈ సినిమా యూనిట్ కు త్వరలోనే ఈ గిఫ్టులిచ్చే ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నారట నాగ శౌర్య.




Related Post

సినిమా స‌మీక్ష