ఛలో హీరో అతని కళ్లలో పడ్డాడట..!

February 13, 2018


img

నాగ శౌర్య హీరోగా వెంకీ కుడుముల డైరక్షన్ లో వచ్చిన సినిమా ఛలో. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. నాగ శౌర్య స్వీయ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా సక్సెస్ అతని కెరియర్ కు మంచి జోష్ అందించింది. ఇక ఈ సినిమా తర్వాత నాశౌర్య దర్శక నిర్మాతల నుండి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ఆల్రెడీ వారందరితో చర్చలు నడిపిస్తున్న నాగ శౌర్య కాణీవిశ్వనాధ్ డైరక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడట.

2002లో నువ్వు లేక నేను లేను సినిమా డైరెక్ట్ చేసిన ఆయన కళ్యాణ్ రాం తో తొలిచూపులోనే సినిమాను తీశారు. ఇక  ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ వస్తున్నారు. ఈమధ్యనే నాగ శౌర్యకు ఓ కథ చెప్పడం ఆయన ఓకే చేయడం అంతా జరిగిందట. ఈ సినిమాకు గురువారం మార్చి ఒకటి అనే టైటిల్ పరిశీళణలో ఉందట. మహేష్ నటించిన దూకుడు సినిమాలో ఈ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.Related Post

సినిమా స‌మీక్ష