సూరిపై చిరు అసంతృప్తి..!

January 19, 2018


img

మాస్ డైరక్టర్ సురేందర్ రెడ్డి డైరక్షన్ లో చిరు 151వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా సైరా నరసిం హారెడ్డి. ఈ సినిమా మొదటి నుండి చిత్రయూనిట్ మధ్య జరుగుతున్న గొడవల గురించి అందరికి తెలిసిందే. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ అటవి ప్రాంతంలో షూట్ చేయనున్నారట. దీని కోసం అంతా సిద్ధం చేశారని తెలుస్తుంది.

ఇక సురేందర్ రెడ్డి టేకింగ్ మీద మెగాస్టార్ అంత సాటిస్ఫై గా లేరు అన్నది ఇన్నర్ టాక్. ప్రతి విషయంలో సురేందర్ రెడ్డికి చిరు డెశిషన్ మేకర్ గా ఉండాల్సి వస్తుందట. మరి సురేందర్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసేదాకా ఉంటాడా లేడా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది. భారీ ప్రాజెక్ట్ పై ఈ రకమైన వాదనలు వినిపించడం ఓ రకంగా సినిమా అవుట్ పుట్ మీద దెబ్బ పడే అవకాశం ఉంటుంది. మరి ఈ విషయాన్ని గమనించి దర్శక నిర్మాతలు ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ అవకుండా చూసుకుంటే బెటర్.Related Post

సినిమా స‌మీక్ష