పెళ్లిచూపులు డైరక్టర్.. ఈ నగరానికి ఏమైంది..!

January 11, 2018


img

పెళ్లిచూపులు సినిమాతో తన సత్తా చాటుకున్న డైరక్టర్ తరుణ్ భాస్కర్ సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో తన సెకండ్ మూవీ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఈ నగరానికి ఏమైంది అన్న టైటిల్ ను పెట్టే ఆలోచనలో ఉన్నారట. పెళ్లిచూపులు సినిమాలానే ఇది కూడా తక్కువ బడ్జెట్ లోనే ముగించేస్తారని తెలుస్తుంది. రీసెంట్ గా సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా ఈ సమ్మర్ లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

ఇక టైటిల్ వినగానే మొన్నటిదాకా సినిమాకు ముందు వచ్చే కాషన్ యాడ్ లా ఈ నగరానికి ఏమైంది అని పెట్టడం సినిమా మరింత ప్రేక్షకుల్లోకి వెళ్లేట్టు చేస్తుందని చెప్పొచ్చు. నలుగురు యువకుల జీవితాలకు సంబందించి కథ ఉంటుందని తెలుస్తుంది. మరి ఈ సినిమా పెళ్లిచూపులు రేంజ్ అందుకుంటుందా లేదా అన్నది వేచి చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష