అజ్ఞాతవాసి.. వర్మ అలా.. కత్తి ఇలా.. ఆది మరోలా..!

January 11, 2018


img

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాపై మరోసరి కత్తి దూశాడు క్రిటిక్ కత్తి మహేష్. సినిమా చెత్తగా ఉందంటూ కామెంట్ చేశాడు. లార్గో వించ్ కు మక్కీకి మక్కీ దించేశాడని దర్శకుడి మీద కూడా ఫైర్ అయ్యాడు మహేష్ కత్తి. అయితే ఈసారి అజ్ఞాతవాసికి కత్తి మహేష్ ఇచ్చిన రివ్యూకి సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ కూడా సపోర్ట్ గా నిలిచాడు. పవన్ సిని కెరియర్ లోనే అత్యంత డిజాస్టర్.. చిత్రమైన పులిని చూసినట్టుగా వర్మ స్పందించాడు.

తాను పులిని మాత్రమే చూశానని.. కాని కోరలు, పంజాలేని పులిని ఇప్పటివరకు చూడలేదని.. పులి చారలు మారడం ఆశ్చర్యమని అన్నాడు వర్మ. జంప్ చేయాల్సిన పులి పాకడం ఏంటని వర్మ సెటైర్ వేశాడు. ఇక కత్తి రివ్యూపై స్పందిస్తూ పవన్ కన్నా కత్తి మహేష్ అందంగా కనిపించాడని అన్నాడు వర్మ. దీనికి కత్తి మహేష్ థ్యాంక్ యూ ని రిప్లై ఇచ్చాడు. ఇక హైపర్ ఆది మాత్రం ఈ ఇద్దరి సంబాషణలు చూసి అదిగో తెల్లకాకి అంటే ఇదుగో పిల్లకాకి అన్నట్టు ఉంది వీరిద్దరి చూస్తే అని సెటరికల్ పంచ్ వేశాడు. మొత్తనికి అజ్ఞాతవాసిపై ఈ ముగ్గురు మూడు విధాలుగా స్పందించడం జరిగింది.Related Post

సినిమా స‌మీక్ష