వెంకటేష్ సీన్స్ ఏమైపోయాయ్..!

January 11, 2018


img

పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాలో విక్టరీ వెంకటేష్ ఉన్నాడన్న న్యూస్ రిలీజ్ ముందు చాలా వరకు స్ప్రెడ్ అయ్యింది. ఇక నిన్న రిలీజ్ అయిన అజ్ఞాతవాసి సినిమా టైటిల్ కార్డ్ లో కూడా వెంకటేష్ కు థ్యాంక్స్ కార్డ్ కూడా వేశారు. సినిమా టైటిల్ కార్డ్ లో వెంకీని చూసి ప్రేక్షకులంతా ఫుల్ జోష్ నింపుకున్నారు. సినిమాలో వెంకటేష్ కూడా సర్ ప్రైజ్ ఇస్తాడని అనుకునారు.

తీరా సినిమా మొత్తం చూసినా వెంకటేష్ సీన్స్ మాత్రం కనిపించలేదు. కనీసం ఇలా వచ్చి అలా వెళ్లిన సందర్భం కూడా లేదు. మరి ఎందుకు వెంకటేష్ కు టైటిల్ కార్డ్ లో స్థానం కల్పించారు అంటే సినిమాలో వెంకటేష్ సీన్స్ ఉన్నాయట. కాని అవి మరో వారం తర్వాత యాడ్ చేస్తారని టాక్. సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది కాబట్టి ఆ సీన్స్ మరో రెండు రోజుల్లో యాడ్ చేస్తారని అనుకుంటున్నారు. మరి సినిమాలో నిజంగానే వెంకటేష్ ఉన్నాడా లేడా అన్న సస్పెన్స్ ఇంకా క్లియర్ అవ్వలేదు. Related Post

సినిమా స‌మీక్ష