సిఎం కేసీఆర్‌ నేడు కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన

February 13, 2020


img

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. బుదవారం రాత్రి 11 గంటలకు కరీంనగర్‌లోని తీగలగుట్టలోని తన నివాసానికి చేరుకొన్నారు. గురువారం ఉదయం 9 గంటలకు కరీంనగర్‌ కలక్టర్ కార్యాలయంకు చేరుకొని అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు చేరుకొంటారు. ముందుగా అక్కడి ముక్తీశ్వరస్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొన్నాక హెలికాఫ్టర్‌లో బయలుదేరి మేడిగడ్డలోని 10.30 గంటలకు లక్ష్మీ బ్యారేజీకి చేరుకొని బ్యారేజీని, ముంపు ప్రాంతాన్ని పరిశీలిస్తారు. మధ్యాహ్నం మేడిగడ్డ వద్దే భోజనం చేసి 2.30 గంటలకు కరీంనగర్‌ చేరుకొంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌ చేరుకొంటారు. 

ములుగు జిల్లాలో తుపాలకుగూడెం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న బ్యారేజీకి వానదేవత సమ్మక్క పేరు పెట్టాలని నిర్ణయించిన సిఎం కేసీఆర్‌ ఈ మేరకు జీవో జారీ చేయవలసిందిగా నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌రావును ఆదేశించారు. Related Post