హరీష్‌రావుకు కోపం వచ్చింది

July 10, 2019


img

ఎప్పుడూ మొహంపై చెరగని చిర్నవ్వుతో కనిపించే మాజీ మంత్రి హరీష్‌రావుకు కోపం వచ్చింది. అందుకు బలమైన కారణమే ఉంది. బోనాల పండుగ సందర్భంగా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్‌రావు బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారి కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులతో పాటు వారు ముగ్గురూ కూడా నేలపై కూర్చొన్నారు. అమ్మవారి కళ్యాణం పూర్తయిన తరువాత ఇంద్రకరణ్ రెడ్డి లేచి నిలబడేందుకు ఇబ్బంది పడుతుంటే, అప్పటికే లేచి నిలబడున్న హరీష్‌రావు ఆయనకు చెయ్యి అందించారు. సరిగ్గా అదే సమయంలో అక్కడే ఉన్న ఓ మీడియా ఫోటోగ్రాఫర్ వారి ఫోటోను తీసి తన పత్రికకు పంపించగా, వారు విషయం తెలుసుకోకుండా ‘హరీష్‌రావు కాళ్ళు మొక్కిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి’ అని వార్తను ప్రచురించేసారు. ఈవిషయం హరీష్‌రావు దృష్టికి రావడంతో సదరు పత్రికపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఇటువంటి అవాస్తవాలను వార్తలుగా ప్రచురిస్తే సహించబోనని హెచ్చరించారు.

 Related Post