కాంగ్రెస్ కూటమి ఏర్పాటుకు బాబు ప్రయత్నాలు

November 08, 2018


img

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఇటీవల డిల్లీ వెళ్లినప్పుడు రాహుల్ గాంధీ, ములాయం సింగ్, అఖిలేశ్ యాదవ్, వామపక్ష నేతలను కలుసుకొని కాంగ్రెస్‌ నేతృత్వంలో కూటమిగా పనిచేయడానికి ఒప్పించారు. ఇవాళ్ళ మధ్యాహ్నం ఆయన బెంగళూరు వెళ్ళి జెడిఎస్ అధినేత దేవగౌడ, ఆయన కుమారుడు కర్నాటక సిఎం కుమారస్వామితో సమావేశం కానున్నారు. ఆ తరువాత చెన్నై వెళ్ళి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత స్టాలిన్ తో సమావేశం కానున్నారు. 

కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీతో కలిసి జెడిఎస్ ప్రభుత్వం నడిపిస్తోంది కనుక జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలో పనిచేయడానికి వారికి ఎటువంటి అభ్యంతరమూ ఉండదు. ఇక తమిళనాడులో అధికార (అన్నాడిఎంకె)పార్టీ ప్రత్యక్షంగానో లేక పరోక్షంగా బిజెపి కనుసన్నలలో పనిచేస్తోంది కనుక, ప్రధాన ప్రతిపక్ష పార్టీ (డిఎంకె) కాంగ్రెస్‌ నేతృత్వంలో పనిచేయడానికి సిద్దంగానే ఉంది. పైగా స్టాలిన్ ఆయన సోదరి కనిమోలి ఇద్దరూ కూడా చంద్రబాబు పట్ల సానుకూలంగా ఉన్నారు. కనుక ఆయన ప్రయత్నాలు ఫలించవచ్చు.


Related Post