ఎన్డీయేకే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి

August 09, 2018


img

ఊహించినట్లుగానే ఎన్డీయే అభ్యర్ధి హరివంశ్ నారాయణ సింగ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆయనకు 125 సభ్యుల మద్దతు లభించగా, కాంగ్రెస్‌ మిత్రపక్షాల అభ్యర్ధి హరిప్రసాద్ కు 105 సభ్యుల మద్దతు లభించింది. దీంతో హరివంశ్ నారాయణ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికయినట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. అనంతరం కాంగ్రెస్‌ తరపున గులాం నబీ ఆజాద్ ఆయనను అభినందిస్తూ ప్రసంగించారు. తరువాత ప్రధాని నరేంద్రమోడీ అయన జీవిత విశేషాలను, అయన గొప్పదనాన్ని సభలో వివరించారు. ప్రస్తుతం అనంతరం ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ఆయనకు అభినందనలు తెలియజేస్తూ ప్రసంగిస్తున్నారు. 

ఎన్డీయే మిత్రపక్షాలతో పాటు తెరాస, శివసేన, జెడి(యు), బిజెడి ఎన్డీయే అభ్యర్ధి హరివంశ్ నారాయణ సింగ్ కి మద్దతు పలికాయి. 



Related Post